ఏపీ మోడ‌ల్ స్కూల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు.. ఆహ్వానం..!

ఆంధ్రప్రదేశ్‌లోని 164 మోడల్‌ స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంగ్లిషుమీడియం బోధనతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ స్కూళ్లలో ప్రవేశ పరీక్ష ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.

ప్రవేశ పరీక్ష వివరాలు:

పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 20, 2025 – ఉదయం 10 గంటలకు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

పరీక్ష స్థాయి: ఐదో తరగతి తెలుగు లేదా ఇంగ్లిష్‌ మీడియం సిలబస్‌ ఆధారంగా

దరఖాస్తు చివరి తేదీ: మార్చి 31, 2025

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే

అధికారిక వెబ్‌సైట్‌లు: www.apcfss.in

📍5వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప్ర‌వేశాల‌కు ద‌రఖాస్తులకు ఆహ్వానం…

ఉమ్మడి జిల్లాలోని అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2025–26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తులకు ఆహ్వానం 

📍బీఆర్‌ఏజీసెట్‌–25 ప్రవేశ పరీక్షతో (ఇంగ్లిష్‌ మీడియం) ఎంపిక చేస్తామని వెల్లడించారు.

📍దరఖాస్తు చివరి తేది…మార్చి 6

https://apbragcet.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ప్రవేశ పరీక్ష….

📍5వ తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 6 వ తేదీన ఉదయం 10 నుంచి 12 గంటల వరకు,

📍ఇంటర్‌ ప్రవేశ పరీక్ష అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు ఉంటుంది

 

📍2025 : ఐఐఎస్‌సీలో బీటెక్ ప్ర‌వేశాలు.. ద‌ర‌ఖాస్తుల వివ‌రాలు..

 

బెంగ‌ళూరులో ఐఐఎస్‌సీ.. ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో అడ్మిష‌న్‌ల కోసం నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేశారు అధికారులు

 

📍నూత‌న విద్యాసంవ‌త్స‌రం 2025-26కు సంబంధించి, బీటెక్‌లో మ్యాథ్స్‌, కంప్యూటింగ్ ప్రోగ్రామ్ వంటి సబ్జెక్టుల్లో ప్ర‌వేశాలు పొందేందుకు అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు.

కోర్సు వివ‌రాలు: మ్యాథ్స్ అండ్‌ కంప్యూటింగ్ ప్రోగ్రామ్‌లో బీ.టెక్

అర్హ‌త‌లు: గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా ప‌ది, ఇంట‌ర్‌ లేదా తత్సమాన పరీక్షను పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక విధానం: ఐఐఎస్‌సీ లేదా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స‌డ్‌, కేవీపీవై లేదా నీట్ వంటి జాతీయ స్థాయి ప‌రీక్ష‌ల్లో విద్యార్థులు సాధించే మార్కుల ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుల విధానం: ఆన్‌లైన్‌లో.. ఐఐఎస్‌సీ అడ్మిష‌న్ పోర్ట‌ల్‌లో ఉన్న అప్లికేష‌న్ పార్మ్‌లో కావాల్సిన‌ వివ‌రాల‌ను న‌మోదు చేసి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఫీజు వివ‌రాలు: జ‌న‌ర‌ల్/ఓబీసీ/ఈడ‌బ్యూఎస్- రూ.500 ఎస్‌సీ/ఎస్‌టీ/పీడబ్యూడీ- రూ.250

ఫీజు చెల్లింపు.. నెట్ బ్యాంకింగ్‌, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అండ్ యూపీఐ వంటి ఆన్‌లైన్ విధానంలో చేయాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: మార్చి 6, 2025

 

📍ఎఫ్ఆర్ఐ లో ఎంఎస్సీ 2025 ప్ర‌వేశాలు…

 

డెహ్రాడూన్‌లోని డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్ఆర్ఐ)లో నూత‌న విద్యాసంవ‌త్స‌రం 2025కి సంబంధించి ఎంఎస్సీ కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు.

కోర్సులు.. అర్హ‌త‌లు..

– ఎంఎస్సీ ఫారెస్ట్రీ: డిగ్రీలో సైన్స్‌తో బాట‌నీ, కెమిస్ట్రీ, జియోల‌జీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, జూవాల‌జీ చేసి ఉండాలి లేదా అగ్రిక‌ల్చ‌ర్ లేదా ఫారెస్ట్రీలో డిగ్రీ చేసి ఉండాలి. – -ఎంఎస్సీ వుడ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ: డిగ్రీలో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, కెమిస్ట్రీ ఉండాలి. లేదా బీఎస్సీ ఫారెస్ట్రీ చేసి ఉండాలి.

– ఎంఎస్సీ ఎన్విరాన్మెంట్ మేనేజ్‌మెంట్‌: డిగ్రీలో బేసిక్ లేదా అప్లైడ్ సైన్సెస్‌, ఫారెస్ట్రీ, అగ్రిక‌ల్చ‌ర్ చేసి ఉండాలి. లేదా బీసీ/బీటెక్‌లో ఎన్‌విరాన్‌మెంట్ సైన్స్ చేసి ఉండాలి.

– ఎంఎస్సీ సెల్లుసాస్ అండ్ పేప‌ర్ టెక్నాల‌జీ: డిగ్రీలో సైన్స్‌తోపాటు కెమిస్ట్రీ లేదా బీఈ/బీటెక్‌లో కెమిక‌ల్/మెకానిక‌ల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి.

📍ప్ర‌వేశ ప‌రీక్ష‌లో క‌నీసం 50% మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించాలి. (ఎస్సీ/ఎస్టీకి 45%).

ద‌ర‌ఖాస్తులు:

అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేష‌న్ ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేయాలి.

ఎంపిక విధానం:

ప్ర‌వేశ ప‌రీక్ష‌లో సాధించిన స్కోర్‌తో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుల రుసుము:

కోర్సుకు రూ.1500, రెండు కోర్సుల‌కు రూ.3000, మూడు కోర్సుల‌కు రూ.4500

రుసుము చెల్లించే విధానం:

డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా రిజిస్ట్రార్ కు, ఎఫ్ఆర్ఐ డీమ్డ్ టు యూనివర్సిటీ, డెహ్రాడూన్ లో చెల్లించాలి.

 

రిజిస్ట్రార్, FRI డీమ్డ్ టు బి యూనివర్సిటీ,

P.O. IPE కౌలాగఢ్ రోడ్, డెహ్రాడూన్–248195

 

ద‌రఖాస్తుల‌కు చివ‌రి తేదీ:

మార్చి 31, 2025

పరీక్ష కేంద్రాలు:

డెహ్రాడూన్, జబల్పూర్, బెంగళూరు, కోల్‌కతా, చండీగఢ్, ఢిల్లీ, లక్నో, జోధ్‌పూర్, సిమ్లా, రాంచీ, కోయంబత్తూర్, జోర్హాట్, హైదరాబాద్.

ప‌రీక్ష తేదీ:

మే 4, 2025

Gurukul Students : ఏడు నెల‌లుగా విద్యార్థుల ప‌రిస్థితి ఇది.. చ‌దివే విద్యార్థుల‌తో వంట‌లు..

ప‌రీక్ష విధానం:

ఆబ్జెక్టివ్ ప్ర‌శ్న‌లు..

1. బేసిక్ సైన్స్ అండ్ సోష‌ల్ సైన్స్ (100 ప్ర‌శ్న‌లు)

2. అర్థమెటిక్ అండ్ క్వాంటిటేటివ్ అబిలిటీస్ (40 ప్ర‌శ్న‌లు)

3. జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ క‌రెంట్ అఫైర్స్ (30 ప్ర‌శ్న‌లు)

4. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్‌సేష‌న్ (30 ప్ర‌శ్న‌లు)

ప‌రీక్ష‌లో నెగిటివ్ మార్కింగ్‌: ఒక్క త‌ప్పు జ‌వాబుకు ¼ మార్కును తొల‌గిస్తారు.

Leave a Comment