RRB Recruitment 2024: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు సంతోషకరమైన వార్త. 8,113 ఖాళీలను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో స్టేషన్ మాస్టర్, కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ వంటి పలు పోస్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్లై విధానం, దరఖాస్తు తేదీలు మరియు ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Railway recruitment 2024 apply online :
దేశవ్యాప్తంగా సుమారు 8,113 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 1,736 కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ పోస్టులు, 3,144 గూడ్స్ రైలు మేనేజర్ ఖాళీలు ఉన్నాయి. ఇంకా, స్టేషన్ మాస్టర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వంటి పోస్టులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఏ రీజియన్లలో ఎంత పోస్టులున్నాయి, దరఖాస్తు ఫీజు ఎంత, అప్లై చేసుకోవడం ఎలా వంటి ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టు పేరు | ఖాళీలు |
కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ | 1,736 |
స్టేషన్ మాస్టర్ | 994 |
గూడ్స్ రైలు మేనేజర్ | 3,144 |
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ | 1,507 |
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ | 732 |
రీజియన్ల వారీగా ఖాళీలు:
రీజియన్ పేరు | ఖాళీలు |
ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్ | 478 |
ఆర్‌ఆర్‌బీ బెంగళూరు | 496 |
ఆర్‌ఆర్‌బీ చెన్నై | 436 |
ఆర్‌ఆర్‌బీ భువనేశ్వర్ | 758 |
అర్హతలు:
యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగిన వారు అర్హులు. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ / సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు, డిగ్రీతో పాటు కంప్యూటర్‌లో ఇంగ్లిష్ / హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి.
వయసు:
01-01-2025 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, దివ్యాంగులకు పదేళ్ల వయసు రిలాక్సేషన్ ఉంది.
ప్రారంభ వేతనం:
- చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ / స్టేషన్ మాస్టర్ పోస్టులకు నెలకు రూ.35,400
- ఇతర పోస్టులకు నెలకు రూ.29,200
దరఖాస్తు రుసుము:
- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు: రూ.500
- ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు: రూ.250